Sunday, October 07, 2012

నీటి ధారతో వంగి ప్రయాణించే కాంతిపుంజం


చాలా సులభంగా చేయగల ఈ ప్రయోగాన్ని చేసేద్దామా....
కారణాన్ని అన్వేషిద్దామా.....

Friday, June 22, 2012

అయోడిన్ రంగు పోగొట్టడం ఎలా ?(చిన్న రసాయనశాస్త్రప్రయోగం)




పాకిస్తాన్ సైన్స్ క్లబ్ వారు మన అరవింద్ గుప్తాగారి లాగా చాలా సరళంగా చేయదగిన ప్రయోగాల వీడియోలను నెట్ లో పెడుతుంటారు. వాటిలో ఇది ఒకటి.

Wednesday, June 20, 2012

మంటలలో కాల్చినా పగలని బుడగను చూద్దామా !



చాలా సులభంగా అందరం చేయగల ప్రయోగం ఇది.
పేపర్ కప్ తో కూడా ఇది చేయవచ్చు.
దీనికి కారణం మనం అందించిన ఉష్ణం మొత్తం నీరు గ్రహించడమే అనుకుంటాను. 

Thursday, May 17, 2012

నీటి తలతన్యతను తెలుసుకొందాం.



ద్రవపదార్ధాలకు ఉండే ముఖ్యమైన లక్షణాలలో తలతన్యత ఒకటి.నీటి అణువుల మధ్య వుండే ఆకర్షణ బలాల వలన ఇలా జరుగుతుందనుకుంటాను.
నీటి బిందువులు ఏర్పడటానికి కూడా ఇదే కారణం.

ఇది ద్రవాలకు ముఖ్యంగా నీటికి గల ఒక ప్రత్యేక 

భౌతికధర్మం. దీనివలన నీటిబిందువులు ఎప్పుడూ 

గుండ్రంగా ఉంటాయి. కాని పెద్ద మొత్తంలోని నీటి ఉపరితలం గురుత్వాకర్షణ బలాల కారణంగా ఒక నున్నని సమతలంగా ఏర్పడుతుంది. ఈ నీటి పైపొర సాగదీసిన రబ్బరు మాదిరిగా స్థితిస్థాపక’ ధర్మాన్ని కలిగి ఉండి కొంత భారాన్ని మోయగలిగే గుణం కలిగి ఉంటుంది. చిన్న కీటకాలుదోమలుపురుగులు నీటిపై స్వేచ్ఛగా నడవగలగటానికి కారణం నీటి తలతన్యత.












Tuesday, May 15, 2012

కొవ్వొత్తులతో చిన్న ప్రయోగం







ఈ ప్రయోగం ద్వారా మూడు విషయాలు చెప్పవచ్చు.

1.మండడానికి గాలి అవసరం.

2.వేడి చేసినప్పుడు గాలి వ్యాకోచిస్తుంది.

3. గాలి అధిక పీడన ప్రాంతాలనుండి అల్పపీడన 

ప్రాంతాలకు ప్రయాణిస్తుంది.

ఎక్కువ  కొవ్వొత్తులు వెలిగించినపుడు ఎక్కువ నీరు 

లోపలికి వెళ్లడానికి కారణం మండడానికి ఆక్సిజన్ 

ఉపయోగ పడడంకంటే, వేడి కారణంగా గాలి వ్యాకోచించి 

గ్లాస్ నుంచి బయటకు వచ్చేయడం కూడా ఒక 

ముఖ్యమైన కారణమే.

ఆ విధంగా గాలి బయటకు రావడం వలన గ్లాస్ లో 

అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది.

అప్పుడు బయటి గాలి లోపలికి వెళ్లడానికి 

ప్రయత్నిస్తుంది.
కానీ నీరు అడ్డుగా వుండడంవలన నీటిని గ్లాస్ లోపలకు 

గాలి నెట్టివేస్తుంది.

కొన్ని పాఠ్యపుస్తకాలలో గాలిలో ఆక్సిజన్ శాతం 

తెలుసుకోవడానికి ఈ ప్రయోగం ఉదహరించారు.

కాని అది సరి కాదనుకుంటాను.



                                           (video taken from aravind guptha channal)

Tuesday, April 10, 2012

ప్రయోగమే పథ నిర్దేశం!

కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ 
హీనంగా చూడకు దేన్నీ,
జ్ఞానాన్ని పంచేవేనోయ్ అన్నీ!

రొట్టె ముక్క , అరటి తొక్క, బల్ల చెక్క 
నీ వేపే చూస్తూ ఉంటాయ్!
తమ లోతు కనుక్కోమంటాయ్!

తలుపు గొళ్ళెం , హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం
కాదేది సైన్సు కనర్హం!
ఔనౌను జ్ఞానమనర్హం!

ఉండాలోయ్ పటనావేశం!
ప్రయోగమే పథ నిర్దేశం!
జీవితమే విజ్ఞానం కోసం!

కళ్లుంటే పరిశీలించి 
మెదడుంటే ఆలోచించి,  చేసి 

అనంత విశ్వం పద్మవ్వూహమ్
విజ్ఞానమొక తీరని దాహం !

(మహా కవి శ్రీ శ్రీ గారికి క్షమాపణలతో)