కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ
హీనంగా చూడకు దేన్నీ,
జ్ఞానాన్ని పంచేవేనోయ్ అన్నీ!
రొట్టె ముక్క , అరటి తొక్క, బల్ల చెక్క
నీ వేపే చూస్తూ ఉంటాయ్!
తమ లోతు కనుక్కోమంటాయ్!
తలుపు గొళ్ళెం , హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం
కాదేది సైన్సు కనర్హం!
ఔనౌను జ్ఞానమనర్హం!
ఉండాలోయ్ పటనావేశం!
ప్రయోగమే పథ నిర్దేశం!
జీవితమే విజ్ఞానం కోసం!
కళ్లుంటే పరిశీలించి
మెదడుంటే ఆలోచించి, చేసి
అనంత విశ్వం పద్మవ్వూహమ్
విజ్ఞానమొక తీరని దాహం !
(మహా కవి శ్రీ శ్రీ గారికి క్షమాపణలతో)